రామ్ చరణ్ నాకు అన్నయ్య అంటూ అఖిల్ పలు మార్లు చెబుతూ ఉంటాడు. ఇండస్ట్రీలో అందరితోనూ మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేసే చరణ్ కు.. అఖిల్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. స్టార్ కిడ్స్ కావడంతో ముందు నుంచి వీళ్లిద్దరూ మాంచి ఫ్రెండ్స్ కూడా. ఇప్పుడు రంగస్థలం మూవీ రిలీజ్ మరి కొన్ని గంటల్లో ఉందనగా రంగస్థలం టీం మొత్తానికి విషెస్ చెబుతూ ట్వీట్ పెట్టాడు అక్కినేని అఖిల్. ‘రేపు రంగస్థలం భారీగా రిలీజ్ కానున్న సందర్భంగా చిట్టిబాబుతో పాటు మొత్తం రంగస్థలం టీం అంతటికి మనస్ఫూర్తిగా విషెస్ చెబుతున్నాను.
మా సూపర్ వదిన.. దర్శకుడు సుకుమార్ కు భారీ విజయం లభించాలని కోరుకుంటున్నాను. మీరంతా ఈ సినిమా కోసం మీ జీవితాన్నే మార్చుకున్నంత పని చేశారు. మీరు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం లభించాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు అఖిల్ అక్కినేని. ఓ స్టార్ హీరో మూవీ రిలీజ్ సందర్భంగా.. ఓ యంగ్ విషెస్ చెప్పడం విశేషం
Here’s wishing chitti babu and the whole team of #Rangasthalam for their big release tomorrow. A big shout out to my super sister in law @Samanthaprabhu2 and one of my directors sukumar garu. You guys have put your life in to it and I’m sure all your hard work will pay off. pic.twitter.com/Rm3h7jBcoa
— Akhil Akkineni (@AkhilAkkineni8) March 29, 2018