ఏదైన ఓ సినిమా ఎక్కువగా జనాల నోళ్ళల్లో నానుతుంది అంటే వెంటనే ఆ సినిమా పేరుతోనో లేదంటే అందులోని ముఖ్య పాత్రల పేరుతో రెస్టారెంట్‌లు ఏర్పాటు చేయడం కామన్‌గా మారింది. ఆ మధ్య బాహుబలి చిత్రంలోని పాత్రల పేరుతో మెనూనే రెడీ చేసి జనాల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు హోటల్ నిర్వాహకులు. ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీగా చెప్పుకుంటున్న రంగస్థలం చిత్రం పై అందరిలో ఆసక్తి నెలకొంది. సినిమాకి సంబంధించి విడుదలైన పాటలు, టీజర్స్, ట్రైలర్ అభిమానులలో అంచనాలు పెంచాయి. రేపు విడుదల కానున్న మూవీ కోసం అభిమానులు కళ్ళలలో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ మూవీ పేరుని క్యాష్ చేసుకోవాలని భావించిన ఓ రెస్టారెంట్ యాజమాన్యం హైదరాబాద్‌లోని కొంపల్లి పరిసర ప్రాంతంలో రంగస్థలం పేరుతో హోటల్ ఏర్పాటు చేశారు. ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. బిజినెస్ కూడా భారీగా జరుగుతుందని సమాచారం. రంగస్థలం చిత్రం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కగా, ఇందులో రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రలు పోషించారు.