సాక్ష్యం టీజర్ విడుదల

547
sakshyam teaser release

శ్రీవాస్ డైరెక్షన్‌ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న మూవీ సాక్ష్యం. ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసింది యూనిట్. ఈ భూమి మీద తప్పు చేసిన ప్రతి ఒక్కరూ నాలుగు దిక్కుల నుంచి ఎవరూ చూడలేదనుకుంటారు కానీ.. ఐదో దిక్కు ఎప్పుడూ చూస్తూనే ఉంటుంది. అదే ఖర్మ సాక్ష్యం. దాని నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. 

ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌. శరత్‌కుమార్, జగపతిబాబు, మీనా, వెన్నెలకిశోర్, అశుతోష్ రానా, జయప్రకాశ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్ పిక్చ‌ర్స్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీ ప్ర‌స్తుతం అమెరికాలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. మే రెండో వారంలో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్‌కి ఈ మూవీ మంచి హిట్‌గా నిలుస్తుంద‌ని టీం చెబుతుంది. హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రామేశ్వర్ ఈ మూవీకి మ్యూజిక్.