సీఎంతో మెగా హీరో ఫైట్ ?

179
Sai Dharam Tej Fight Against CM in Republic

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తాజాగా నటిస్తున్న చిత్రం “రిపబ్లిక్”. ప్రస్థానం’ ఫేం దేవకట్టా ‘రిపబ్లిక్’ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. భగవాన్, జె.పుల్లారావు నిర్మాతలు. “రిపబ్లిక్” చిత్రంలో సాయి ధరమ్ తేజ్ కు జోడిగా నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “రిపబ్లిక్” సినిమాలో సాయి ధరమ్ తేజ్ కలెక్టర్ పాత్ర పోషిస్తున్నాడనే విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు సినిమా స్టోరీ లైన్ వివాదాస్పద కాన్సెప్ట్ తో సాగుతుందనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అదేంటంటే… కలెక్టర్ పాత్రలో సాయి ధరమ్ తేజ్ కొల్లేరు సరస్సు పూర్వ వైభవం కోసం సీఎంతో ఫైట్ చేస్తారని అంటున్నారు.

ఇక సీఎం పాత్రలో రమ్యకృష్ణ నటించనున్నారు. “రిపబ్లిక్” చిత్రాన్ని జూన్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకున్నారు దర్శకనిర్మాతలు. సాయి ధరమ్ తేజ్ కు “రిపబ్లిక్”14వ చిత్రం కాగా… కొద్దిరోజుల క్రితమే పవన్ చేతుల మీదుగా ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.