ఆర్జీవికి షాకిచ్చిన సెన్సార్ బోర్డ్

199
Censor Board Gives Shock To Ram Gopal Varma

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తాజాగా సెన్సార్ బోర్డు షాకిచ్చింది. హైదరాబాద్ లో 2019 నవంబర్ 26న జరిగిన దిశ హత్యాచార ఘటన ఆధారంగా రామ్ గోపాల్ వర్మ “దిశ ఎన్‌కౌంటర్” చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాకు ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించారు. నట్టి క్రాంతి, నట్టి కరుణ నిర్మాతలు. తాజాగా “దిశ ఎన్‌కౌంటర్” సినిమాకు సెన్సార్ చేయడానికి సెన్సార్ బోర్డు కమిటీ నిరాకరించింది.

“దిశ ఎన్‌కౌంటర్” చిత్రంలో రియల్ ఎన్‌కౌంటర్ ను పోలిన సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నలుగురు సభ్యుల సెన్సార్ బృందం ఈ సినిమా సెన్సార్ రిజెక్ట్ చేయడంతో “దిశ ఎన్కౌంటర్” సినిమాను రివిజన్ కమిటీ ముందుకు తీసుకు వెళ్లనున్నారు దర్శక నిర్మాతలు.

ఇప్పటికే దిశ తల్లిదండ్రులు “దిశ ఎన్‌కౌంటర్” సినిమా విడుదలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే “దిశ ఎన్‌కౌంటర్” సినిమా విడుదల ఆపాలంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు దిశ తల్లిదండ్రులు.

అయితే ఈ సినిమా విడుదల చేయాలా ? వద్దా అనే విషయాన్ని నిర్ణయించాలంటూ సెన్సార్ బోర్డును ఆదేశించింది హైకోర్టు. తాజాగా “దిశ ఎన్‌కౌంటర్” సినిమా సెన్సార్ రిజక్ట్ అవడంతో సినిమా విడుదలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.