తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. . తాజాగా హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.
గత 24 గంటల్లో 37,387 కరోనా పరీక్షలు నిర్వహించగా 169 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,270కి చేరుకుంది.
ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 2,91,699 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,607కి పెరిగింది.
ప్రస్తుతం 1,964 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 780 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 31 కరోనా కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది.