“రిపబ్లిక్” షూటింగ్ పూర్తి… 64 రోజుల్లో ఒక్క కోవిడ్‌ కేసు లేకుండా…!

223
Sai Dharam Tej Fight Against CM in Republic

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం దేవ కట్టా దర్శకత్వంలో ‘రిపబ్లిక్’ అనే మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్నారు.

జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, జీ స్టూడియోస్‌ పతాకాలపై ఈ చిత్రాన్ని భగవాన్, జె.పుల్లారావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. భారీ రేంజ్‌లో నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

మెగా మేనల్లుడి కెరీర్‌లో 14వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

పొలిటికల్ నేపథ్యంలో కొల్లేరు సరస్సుకు సంబంధించిన వివాదాస్పద కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందించారని టాక్. జూన్‌ 4వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

గత కొన్ని రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నేటితో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ట్వీట్ పెట్టారు డైరెక్టర్ దేవ కట్టా, హీరో సాయి ధరమ్ తేజ్.

”రిపబ్లిక్‌ షూట్‌ పూర్తి చేశాం. కేవలం 64 రోజుల్లో అదృష్టవశాత్తు ఎలాంటి కోవిడ్‌ కేసులు లేకుండా షూటింగ్ విజయవంతంగా పూర్తి చేశాం.

మా చిత్రయూనిట్ మొత్తానికి ఈ క్రెడిట్‌ దక్కుతుంది. థ్యాంక్యూ” అని ట్వీట్ చేస్తూ చిత్రబృందం అంతా కలిసి దిగిన పిక్ షేర్ చేశారు డైరెక్టర్ దేవ కట్టా.

ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్న సాయి ధరమ్ తేజ్.. ”రిపబ్లిక్‌ షూట్‌ కంప్లీట్ అయింది. కెమెరా వెనుక, ముందు అందరి కృషి వల్లే ఇంత త్వరగా షూటింగ్‌ పూర్తయింది.

అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. నా కెరీర్‌లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు.

కాగా ఇటీవలే ‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సాయి ధరమ్ తేజ్.