తెలంగాణలో రేపటి నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభం కానున్నాయి. స్కూళ్లు ప్రారంభానికి రాష్ట్ర విద్యాశాఖ అనుమతి ఇచ్చింది.
రేపటి నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు ఎప్పుడైనా తరగతులను ప్రారంభించుకోవచ్చని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.
కోవిడ్ మార్గదర్శక సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని, తల్లిదండ్రుల అనుమతి కూడా తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించారు.
కరోనా నేపథ్యంలో పాఠశాల నిర్వాహకులు కొవిడ్ మార్గదర్శకాలు విధిగా పాటించాలని సూచించారు.
విద్యార్థులు పాఠశాలకు విధిగా హాజరుకావాలన్న నిబంధనేది లేదని పేర్కొన్నారు.
పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరని ఆమె పేర్కొన్నారు.
కరోనా విజృంభించడంతో గత ఏడాది మార్చి చివరి నుంచి విద్యాలయాలు మూతపడ్డాయి.
సుదీర్ఘకాలం తర్వాత 9, 10 వ తరగతులు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో 6, 7, 8 తరగతులను ప్రారంభించేందుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.