ప్రభాస్, సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సాహో. ఏకంగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. సాహో చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్.. మేకింగ్ వీడియోలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. హాలీవుడ్ స్థాయిలో ఉన్న మేకింగ్ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటని ఆస్ట్రియాలోని ఇన్స్‌బర్క్, టిరోల్‌లో ఓ పాట చిత్రీకరణ పూర్తి చేసారు . తాజాగా ఈ చిత్రంలోని తొలిపాట టీజర్‌ను విడుదల చేశారు.
సైకో సయాన్ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రభాస్, శ్రద్ధాలకి సంబంధించిన విజువల్స్ ఫ్యాన్స్‌ని అలరిస్తున్నాయి. ఈ సాంగ్‌ని జూలై 8న విడుదల చేయనున్నారు.
ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా సాహో సినిమా విడుదల అవుతుంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మళయాల భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. నీల్ నితిన్ ముఖేశ్,ఎవ్లిన్ శర్మ,మురళీ శర్మ,జాకీ ష్రాఫ్, మందిరా బేడీ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జిబ్రాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.