ఈ రోజు రాశి ఫలితాలు–శుక్రవారం 05 జులై 2019

129
horoscope-details

మేష రాశి : మీపిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారికి సంబంధించిన పనులు పూర్తి చేయగలుగుతారు. మీ ప్రేమను మీరు ప్రేమించిన వ్యక్తికి చెప్పటానికి అనుకూలదినం. మానసికంగా ఉత్సాహంగాఉన్నప్పటికీ, తెలియని చిన్నఆందోళన మనసులోఉంటుంది. మీభావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం మంచిది. కాంపిటేటివ్‌ పరీక్షలు రాస్తున్నవారు విజయం సాధిస్తారు.

వృషభ రాశి : ఈ రోజు మీఇంటికి సంబంధించిన పనులు చేయటానికి, గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూలంగాఉంటుంది. అయితే ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. మానసికంగా కొంత ఆందోళన కానీ, చిరాకుగా కానీ ఉండటం జరుగుతుంది. చదువు పట్ల కొంత నిరాసక్తతఉంటుంది. వాహనాలవిషయంలో జాగ్రత్త అవసరం.

మిథున రాశి : ఈ రోజు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. బంధువులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణంచేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అత్యుత్సాహానికి పోకుండా మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం మంచిది. ఆర్థికంగా అనుకూలంగాఉంటుంది. భాగస్వామ్యవ్యాపారం కలిసి వస్తుంది. మీరిచ్చేసలహాలు ఎదుటివారికి లాభిస్తాయి.

కర్కాటక రాశి : ఈ రోజుఆర్థికంగా కొంత సామాన్యంగాఉంటుంది. పాత బాకీలు వసూలయినప్పటికీ, అందుకు తగిన ఖర్చుపైన పడటంతో వచ్చిన డబ్బువచ్చినట్టేపోతుంది. పెట్టుబడులకు, వ్యాపారలావాదేవీలకు అనువైనరోజుకాదు.ఇంటికి సంబంధించిఏదైనావస్తువు కొనుగోలుచేస్తారు. దూరపు బంధువుల కారణంగా డబ్బుఖర్చయ్యే అవకాశముంది.

సింహ రాశి : ఈ రోజు మీకు అనుకూలంగాఉంటుంది. రుచికరమైన ఆహారం లభిస్తుంది. మిత్రులు, బంధువులతో కలిసి ఏదైనా శుభకార్యంలో పాల్గొంటారు. అనుకున్న పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా అనుకూలిస్తుంది. అనుకోని ధనలాభం కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయసహకారాలుఅందుకుంటారు.

కన్య రాశి : ఈ రోజు బద్ధకంగాగడుపుతారు. ఏ పనిచేయటానికి ముందుకురారు. కుటుంబసభ్యులకోపానికిగురవుతారు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. మీ మిత్రులతోకానీ, దగ్గరి బంధువులతో కానీ వివాదం జరగటం లేదా వారుమిమ్మల్ని అపార్థం చేసుకోవటం జరగవచ్చు. భూ సంబంధవ్యవహారాలకుఅనుకూలదినంకాదు. మీ తల్లిగారి ఆరోగ్యంవిషయంలో జాగ్రత్తఅవసరం.

తుల రాశి : ఈ రోజుఅనుకూలంగాఉంటుంది. మిత్రుల నుంచి అనుకోని సాయం అందుకుంటారు. మీస్నేహం బలపడుతుంది. మానసికంగా ఉత్సాహంగాఉంటారు. పోటీ పరీక్షల్లోవిజయంసాధిస్తారు. ప్రేమవ్యవహారాల్లో అనుకోని శుభపరిణామాలు ఏర్పడతాయి. పెట్టుబడులు లాభిస్తాయి. వ్యాపారంలోమంచి లాభాలుగడిస్తారు.

వృశ్చిక రాశి : ఈ రోజువాయిదా పడుతున్న పనులు పూర్తి చేయటానికి అనుకూల సమయం. పైఅధికారులను కలవటానికి అలాగే ముఖ్యమైన ఒప్పందాలకుకూడా అనుకూలించే దినం. అనుకోని బహుమతులుకాని, ప్రశంసలు కాని పొందుతారు. మీమిత్రులు లేదాబంధువుల సహాయంఅందుకుంటారు. అనుకోనివ్యక్తులను కలుసుకుంటారు.

ధనుస్సు రాశి : ఈ రోజు రోజువారీ పనుల నుంచి విశ్రాంతి కోరుకుంటారు. అలాగే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగాచూపుతారు. గురువులను లేదా ఆధ్యాత్మికవేత్తలను కలుస్తారు. ప్రయాణంలోఅడ్డంకుల కారణంగా విసుగుకు లోనవుతారు. ఇంట్లోకి కొత్తవస్తువులుకొనటంకానీ, ఇల్లు సర్దటంకానీచేస్తారు. ఆర్థికంగా సామాన్యంగాఉంటుంది.

మకరం రాశి : ఈ రోజు మానసికంగా కొంత ఆందోళనతో ఉంటారు. ఒక సంఘటన కారణంగా మీమనసు చెదురుతుంది. ఆర్థికనష్టం, కోపం, అనారోగ్యం, కలహాలు, ఆందోళన మొదలైన భయం ఈ రోజు సూచించబడ్డాయి. మీఆవేశాన్ని, కోపాన్నిఅదుపులోఉంచుకోవటం మంచిది. శివున్ని పూజించండి. మీసంతానం కారణంగా ఆనందంపొందుతారు.

కుంభ రాశి : ఇతరులతో సంబంధ, బాంధవ్యాలు పెంచుకోవటానికి, ఒప్పం దాలను, అంగీకారాలను కుదుర్చుకోవటానికి అనుకూలదినం. మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణంచేస్తారు. మీ ప్రేమను, ఆప్యాయతను వ్యక్తంచేయటానికి అనువైనదినం. పిల్లల ఆరోగ్య విషయంగా లేదా విద్యావిషయంగా కొంత ఆందోళన చెందుతారు.

మీన రాశి : వివాదాలు పరిష్కరించుకోవటానికి ముఖ్యంగా భూమిసంబంధ వివాదాలు పరిష్కరించుకోవటానికి అనుకూలదినం. మీ మాట నెగ్గుతుంది. అనుకూల ఫలితం పొందుతారు. ఆర్థిక లాభాలుంటాయి. జీవిత భాగస్వామి అనారోగ్యం కొంత ఆందోళనకు కారణమవుతుంది. గృహ, వాహన సంబంధ కొనుగోళ్లు చేస్తారు. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి.