జీతం డబ్బులతో కేటీఎం బండి కొన్న జొమాటో డెలివరీ బాయ్‌…యూత్ ఫిదా….

720
bought KTM bike

కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుంది. కోరిన కోరికలు నెరవేరతాయి. అందుకు ఈ జొమాటో కుర్రాడే నిదర్శనం. హరియాణాలోని కర్ణాల్‌లో ఉంటాడు. పేరు సూరజ్. ఫుడ్ డెలివరీ యాప్ జొమాటలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. పొద్దున్నంచి అర్ధరాత్రి వరకు ఆర్డర్స్ తీసుకుని చక్కర్లు కొడుతుంటాడు.

సూరజ్‌కు చిరకాల కోరిక ఒకటి ఉంది. కేటీఎం ఆర్సీ 200 బైకుపై తిరగాలన్నది ఆ కోరిక. కానీ అతని స్థాయికి ఖరీదైనదే. అయినా సూరజ్ తగ్గలేదు. కష్టపడ్డాడు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఫుడ్ ప్యాకెట్లు డెలివరీ చేశాడు. కడుపు కట్టుకుని మరీ పొదుపు చేశాడు. మొత్తం 5 నెలల జీతం దాచుకున్నాడు.

హీరోలా బైక్ షోరూం వెళ్లి తనకిష్టమైన బండిని స్పాట్‌లో నగదు పెట్టి కొనేశాడు. బైక్ ఖరీదు రూ. 2.20 లక్షలకు పైనే. సూరజ్ నెలకు రూ. 40 వేలకు పైగా దాచి మరీ దాన్ని సొంతం చేసుకున్నాడు.

జొమాటో వ్యవస్థాపకుడు దీపీందర్ గోయల్ ఈ విషయం తెలుసుకునుని అతని గురించి ట్వీట్ చేశాడు. బండిపై సూరజ్ ఉన్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు. కష్టపడితే దక్కనిదేదీ ఉండదంటూ నెటిజన్లు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

‘నీ అసలు జీతం ఎంతో నిజంగా చెప్పు గురూ?’ అని కొందరు అడుగుతున్నారు. జొమాటో బాయ్స్‌లో కొందరు నెలకు 60 వేలు జీతం జేబులో వేసుకుంటున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకంటే స్విగ్గీ, జొమాటో బాయ్స్ ఎక్కువ సంపాదిస్తున్నారని టాక్.