మాస్ మహారాజా రవితేజ తాజాగా మరో సినిమాను ప్రకటించారు. ‘సినిమా చూపిస్తా మావ’, ‘నేను లోకల్’ వంటి హిట్ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ తన 68వ సినిమాను చేస్తున్నారు.
మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు.
వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీకి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
ఈ సంక్రాంతికి విడుదలైన “క్రాక్”’తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన రవితేజ త్వరలో “ఖిలాడి” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
“ఖిలాడి” మూవీ షూటింగ్ పూర్తి కాగానే ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. రవితేజకు ఇది 68వ చిత్రం.
We are happy to announce that we will be teaming up with Mass Maharaja @RaviTeja_offl & #TrinadhaRaoNakkina for a mass entertainer #RT68 🔥
Story & Screenplay: @KumarBezwada @peoplemediafcy @AAArtsOfficial @vishwaprasadtg @AbhishekOfficl @vivekkuchibotla
More details soon!! pic.twitter.com/rPDUh5oN2s
— People Media Factory (@peoplemediafcy) February 21, 2021