ప్రభాస్ న్యూ లుక్ వైరల్

169
Prabhas New Look Goes viral in Social Media

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్రస్తుతం నటిస్తున్న భారీ చిత్రాల్లో “ఆదిపురుష్” కూడా ఒకటి. ప్ర‌స్తుతం ముంబైలో వేసిన సెట్‌లో షూటింగ్ జ‌రుపుకుంటుంది.

అయితే తాజాగా సెట్‌లో ఓ అభిమానితో ప్ర‌భాస్ ఫొటో దిగ‌గా, ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో ప్ర‌భాస్ త‌ల‌కు స్టైలిష్ క్యాప్, క‌ళ్ల‌జోడు పెట్టుకొని స్ట‌న్నింగ్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు.

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందనుంది ‘ఆదిపురుష్’ మూవీ. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం భారీ తారాగణాన్ని ఎంచుకున్నారు.

పౌరాణిక గాథ రామాయణంను ఈ ‘ఆదిపురుష్’ రూపంలో చూపించనున్నారట. 400 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్ రాముడిగా కనిపించ‌నుండ‌గా, రావ‌ణుడి పాత్ర‌లో సైఫ్ అలీ ఖాన్ క‌నిపించ‌నున్నాడు.

ఈ సినిమాలో కీలక పాత్రలైన సీత, హనుమ, లక్ష్మణ క్యారెక్టర్స్ ఎవరు చేయబోతున్నారు అనే విషయంలోనే ఇంకా ఓ స్పష్టత రాలేదు.

ఐదు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

వచ్చే ఏడాది ఆగస్ట్ 11న సినిమాను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే డైరెక్టర్ ఓం రౌత్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ప్రభాస్ కెరీర్‌లో 22వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీపై రెబల్ స్టార్ అభిమానులు అంచనాలు ఆకాశాన్ని అంటాయి.

మరోవైపు ప్రభాస్, పూజాహెగ్డే నటించిన ఫ్రెష్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్”తో జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆ తరువాత అక్టోబ‌ర్ లో “స‌లార్” చిత్రంతో ప్రభాస్ థియేట‌ర్స్‌లోకి రానున్నాడు. “స‌లార్” చిత్రాన్ని ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తుండ‌గా, ప్ర‌స్తుతం ఈ చిత్రం బొగ్గు గ‌నుల‌లో షూటింగ్ జ‌రుపుకుంటుంది.

పాన్ ఇండియా సినిమాగా “సలార్”ను తెర‌కెక్కిస్తున్నారు ప్ర‌శాంత్ నీల్.