బాలీవుడ్ భామలతో “లైగర్” టీం… పిక్స్ వైరల్

197
‘Liger’ team chill out at party with Kiara and Sara

సెన్సేషనల్ హీరో విజ‌య్ దేవ‌రకొండ హీరోగా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం “లైగ‌ర్”.

ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పూరి కనెక్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా ‘లైగర్’ టీమ్ పార్టీ చేసుకుంది. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్, ఛార్మి, బాలీవుడ్ భామలు కియార అద్వానీ, సారా అలీ ఖాన్ హాజరయ్యారు.

ఆ చిల్ అవుట్ ఫొటోలను ఛార్మి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Charmmekaur (@charmmekaur)

నిజానికి ‘లైగర్’ సినిమాలో సారానే హీరోయిన్‌గా నటించాల్సింది. అయితే సారా డేట్లు అడ్జెస్ట్ చేయలేకపోవడం వల్ల ఆ ఛాన్స్ అనన్య దక్కించుకుంది.

ఇక కియార, విజయ్ కలిసి ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొన్నారు.

బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా థాయ్‌లాండ్‌లో ప్రత్యేకంగా బాక్సింగ్ కు సంబంధించిన శిక్షణ తీసుకున్నారు.

‘లైగర్’ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ పాన్ ఇండియా సినిమా సెప్టెంబర్ 9న విడుదల కానుంది.