
క్రికెట్ రంగంలో ఇలాంటి వ్యక్తిలు చాలా అరుదుగా ఉంటారు. కెరీర్‌ను డెవలఫ్ చేసుకోలేక తప్పుడు మార్గాల్లో నడిచేవారు చాలా మందే ఉన్నారు.
అంతేకాదు కష్టపడకుండా డబ్బు సంపాదించడమెలా అని ఆలోచించేవారు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యారు. ఈ కోవకు చెందిన వ్యక్తే రంజీ మాజీ క్రికెటర్ నాగరాజు.
గతంలో ఇతనిపై ఇలాంటి కేసులు అనేకం చూశాం. అరెస్టయి బయటికి వస్తున్నాడు. కానీ ఇతని బుద్ధి మాత్రం మారడం లేదు.
తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కు పీఏనని చెప్పి ప్రముఖుల నుంచి డబ్బు వసూలు చేసే క్రమంలో మరోసారి అరెస్టయ్యాడు. శ్రీకాకుండా జిల్లా పోలంకి మండటం ఎవ్వారిపేట గ్రామానికి చెందిన బుడుమూరు నాగరాజు మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్.
జల్సాలకు అలవాటు పడ్డ ఇతను తేలిగ్గా డబ్బులు సంపాదించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో తాను కేటీఆర్ పీఏనని పరిచయం చేసుకోవడం మొదలుపెట్టాడు.
ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు బంజారాహిల్స్‌లో ఉన్న రెయిన్ బో పిల్లల ఆస్పత్రి ల్యాండ్ లైన్‌కు ఫోన్ చేసి ఎండీ, డాక్టర్ కంచర్ల రమేష్ ఫోన్ నంబర్ తీసుకున్నాడు.
తర్వాత డాక్టర్ రమేష్‌కు ఫోన్ చేసి తాను కేటీఆర్ పీఏ తిరుపతి రెడ్డిని మాట్లాడుతున్నానని చెప్పాడు. ఈ నెల 25న కేటీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పి మీడియా ప్రకటనల కోసం రూ. 50 లక్షలు ఏర్పాటు చేయాలని కోరాడు.
అయితే డాక్టర రమేష్‌కు అనుమానం వచ్చి ఆరా తీయగా ఆ నంబర్ తిరుపతి రెడ్డిది కాదని తెలిసింది. దీంతో వెంటనే ఆస్పత్రి సీనియర్ మేనేజర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ప్రస్తుతం నిందితుడు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలిసింది. గతంలోనూ ఈ నాగరాజు ప్రముఖులకు ఫోన్లు చేసి డబ్బులు డిమాండ్ చేసి అరెస్టయిన ఘటనలు ఉన్నాయి.
జూబ్లీహిల్స్, ఓయూ, సైబర్ క్రైం పోలీసులు గతంలోనూ ఇతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.