
ఇటీవల యంగ్ హీరో నితిన్ 30వ సినిమా విడుదల తేదీని ప్రకటించిన విషయం తెలిసిందే.
నితిన్ 30వ సినిమా ‘అందాదున్’ తెలుగు రీమేక్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన చిత్రయూనిట్ శ్రీముఖిని కూడా ట్యాగ్ చేసింది.
దీంతో ఇందులో శ్రీముఖికి కూడా నటిస్తోందా? అనే డౌట్ మొదలయ్యింది. ఇదే ట్వీట్‌ని రీట్వీట్ చేసిన శ్రీముఖి ఈ సినిమాలో భాగం కావడం హ్యాపీగా ఉందని పోస్ట్ చేసింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రీముఖిని చూపించి వెండితెరపై ఈమె కెరీర్ టర్న్ చేసేలా ఈ క్యారెక్టర్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. దీంతో ఇందులో శ్రీముఖి పాత్ర ఎలా ఉండబోతోంది అనే విషయం ఆసక్తికరంగా మారింది.
Happy to be onboard! 🙂 https://t.co/83HOjRtEk0
— SreeMukhi (@MukhiSree) February 19, 2021
బుల్లితెర రాములమ్మగా ఆకట్టుకుంటున్న శ్రీముఖి వెండితెరపై అలరిస్తూనే సినిమాల్లో కూడా మెరుస్తోంది.
ఇప్పటికే జులాయి, నేను శైలజ, జెంటిల్‌మన్, బాబు బాగా బిజీ లాంటి సినిమాల్లో నటించిన శ్రీముఖి ప్రస్తుతం ‘క్రేజీ అంకుల్స్’ అనే మూవీ చేస్తోంది.
కాగా నితిన్ బాలీవుడ్ లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘అంధాదున్’ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ సినిమాను ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు.
మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి హరి కె. వేదాంత్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
ఈ సినిమాలో నితిన్ సరసన నభా నటేష్ కథానాయికగా నటిస్తుంది. తమన్నా భాటియా ఓ కీలక పాత్ర చేస్తున్నారు.
నితిన్ 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమాను జూన్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.