విరసం నేత వరవరరావుకు బెయిల్ మంజూరు!

183
Granted bail for Virasam Varavara Rao

విరసం(విప్లవ రచయితల సంఘం) నేత వరవరరావుకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

గోరేగావ్ కుట్ర కేసులో ఏడాది కాలంగా వరవరరావు జైలు జీవితాన్ని గడుపుతున్నారు.

ఆయన అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని షరతులతో కూడిన బెయిల్ ను బాంబే హైకోర్టు మంజూరు చేసింది. ఆరు నెలల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని కోర్టు వెల్లడించింది.

ఆరోపణలు ఉన్న కేసు విచారణకు సంబంధించి, పోలీసులకు సహకరించాలని న్యాయమూర్తి రవరరావుకు ఈ సందర్భంగా సూచించారు.

సాక్ష్యాల తారుమారుకు ప్రయత్నిస్తే, బెయిల్ ను రద్దు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.

ఈ రోజు సాయంత్రం లోగా బెయిల్ పేపర్లను జైలు అధికారులకు అందజేస్తామని ఆయన తరఫు న్యాయవాదులు వెల్లడించారు.సాయంత్రంలోగా విడుదలయ్యేలా  చూస్తామని పేర్కొన్నారు.