సురేఖవాణి రెండో పెళ్ళి… ఆమె స్పందన ఇదే…!

195
Surekha Vani Responds to Second Marriage Rumors

టాలీవుడ్ సీనియర్ నటి రెండు దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో నటిగా రాణిస్తున్నారు. అయితే తాజాగా ఈ నటి రెండో పెళ్లి చేసుకోనుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ వార్తలపై సురేఖవాణి స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

తన రెండో పెళ్లిపై ఓ వెబ్‌సైట్‌లో ప్రచురితమైన వార్త, ఫేస్‌బుక్ పోస్ట్‌ను స్క్రీన్ షాట్ తీసి దాన్ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు సురేఖవాణి. దానిపై ‘ఫేక్ న్యూస్’ అని రాశారు.

అసలు తనకు ఫేస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్లే లేవని సురేఖవాణి స్పష్టం చేశారు. కేవలం ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మాత్రమే ఉందని వెల్లడించారు.

కాగా సురేఖవాణి భర్త సురేష్ తేజ అనారోగ్యంతో 2019లో కన్నుమూశారు. ఈ దంపతులకు సుప్రీత ఒక్కరే సంతానం.

ఇక సురేఖవాణి ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నారు. ఇక ఇటీవల ఆమె తన కూతురితో కలిసి పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.