తెలంగాణలో నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్లు వేసేందుకు ఆయా పార్టీల నుంచి అభ్యర్థులు సిద్దమవుతున్నారు.
పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవికి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఇచ్చారు.
ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరును ఇప్పటికే ప్రకటించారు.
టీఆర్‌ఎస్ పార్టీ మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి గా సురభి వాణిదేవి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఈ నేపథ్యంలో ఉదయం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్‌లో మూడు ఉమ్మడి జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ఈ నెల 23 తుది గడువు. మార్చి 14న పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 17న ఓట్ల లెక్కింపు జరగనుంది.