మద్యనిషేధం కొనసాగుతున్నా రాష్ట్రాల్లో కొందరు స్థానికాంగా కల్తీ సారా తయారు చేసి విక్రయిస్తుంటారు.
మద్యానికి బానిసైన మందుబాబులు ఈ సారా త్రాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా బీహార్‌లో కల్తీ సారా ఐదుగురి ప్రాణాలను బలితీసుకుంది.
ఈ ఘటన ముజఫర్‌పూర్ జిల్లాలో గత మూడు రోజుల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు ఐదుగురు మృతిచెందారు.
జిల్లాలోని కట్రా పోలీస్‌స్టేషన్ పరిధిలోగల దర్గా గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
కొందరు స్థానికంగా తయారు చేసి అమ్ముతున్న కల్తీసారానే వారి మరణానికి కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బీహార్‌లో గత ఐదేండ్లుగా మద్యనిషేధం కొనసాగుతోంది.అయినప్పటికీ మద్యం మహమ్మారి ఐదుగురిని పొట్టనపెట్టుకోవడం స్థానికంగా కలకలం రేపుతున్నది.
అధికారులు కల్తీ సారా అమ్మకాలను అరికట్టడంతో విఫలమవుతున్నారని ఆ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు.