రాజస్థాన్ లో విషాద ఘటన చోటు చేసుకొంది. ఆ రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ మదన్‌లాల్ సైనీ కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
సికర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.మదన్‌లాల్ సైనీ 2019లో మృతి చెందారు.
ఆత్మహత్య చేసుకున్న వారిలో హనుమాన్ ప్రసాద్, ఆయన భార్య తార, వారి ఇద్దరు కుమార్తెలు అంజు, పూజ ఉన్నారు. వీరంతా ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
హనుమాన్ ప్రసాద్, తార దంపతుల పెద్ద కుమారుడు (17) గతేడాది సెప్టెంబరులో మృతి చెందాడు.
అప్పటి నుంచి వీరంతా తీవ్రమైన మానసిక వ్యధలో కూరుకుపోయినట్టు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను సికర్‌లోని శ్రీ కల్యాణ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కుమారుడు లేకుండా జీవించడం కష్టమని, అందుకనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.