ఎటువంటి సపోర్ట్ లేకుండా చిన్న చితక వేషాలతో కెరీర్ నీ మొదలు పెట్టి .. ఒక్కో సినిమాకు తనేంటో నిరూపించుకొని ఒక బ్రాండ్ హీరో గా ప్రత్యేకమైన అభిమానాన్ని సంపాదించుకొని.. ఇండస్ట్రీ లో ఒక బడా హీరో గా పేరుపొందిన మాస్ మహారాజ్ రవితేజ.
గత కొంత కాలంగా సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. తన ఫ్యాన్స్ తో సహా ఇతర హీరోల అభిమానులు కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మాస్ కం బ్యాక్ ఎట్టకేలకు అయితే సూపర్ స్ట్రాంగ్ గా “క్రాక్” తో ఇచ్చారు.
రవి తేజ కెరీర్ లోనే బిగేస్ట్ హీట్ అనీ సినీమా యూనిట్ సక్సెస్ మీట్ లో పేర్కొన్నారు. ఇక బలుపు , డాన్ శీను, క్రాక్ సినిమాలతో రవితేజ ,దర్శకుడు గోపీచంద్ మలినేనితో హ్యాట్రిక్ చిత్రంగా అదిరిపోయే మాస్ మసాలా సినిమాను అందించారు.
ఈ సంక్రాంతి కి విడుదల అయిన, మాస్టర్, రెడ్, అల్లుడు అదుర్స్, సినీమాల తో పోలిస్తే క్రాక్ సూపర్ హిట్ సినిమా గా దూసుకుపోతుంది. ఈ సంక్రాంతికి గాను అనేక చిక్కులతో వచ్చినప్పటికీ వాటన్నిటినీ తొక్కిపెట్టి సూపర్ స్ట్రాంగ్ గా మాస్ మహారాజ్ రవితేజ నిలబడుతుండడం సినిమా గట్టి హీట్ కొట్టడం విశేషం.
ఈ సినిమా తో రవితేజ మళ్లీ ఫామ్ లోకి రావడమే కాకుండా ఇక నుంచి కథ ఎంపికలో మరింత దృష్టి పెట్టాలని మంచి కథలను తీయాలని చూస్తున్నాడు అట.
అయితే కొన్ని సినిమాల కారణంగా , మొదటగా క్రాక్ నీ కొన్ని థియేటర్ లో నుండి తీసివేసినప్పటికీ, హీట్ టాక్ తెచ్చుకోవడంతో క్రాక్ సినిమాకు కు పలు చోట్ల స్క్రీన్స్, షోలు యాడ్ అవుతుండడమే కాకుండా ఇతర సినిమాలతో రీప్లేస్ చేసి కూడా క్రాక్ ప్రదర్శిస్తున్నారు.
దీనితో మరోసారి సంక్రాంతి విన్నర్ ఎవరో అన్నది క్లియర్ అయ్యిపోయింది అని చెప్పొచ్చు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా ఇప్పుడు ఈ సినిమా రీమేక్ హక్కులకు గాను భారీ ఆఫర్స్ తో పెద్ద ఎత్తున పోటీ నెలకొనట్ట్లు సమాచారం.
మరిన్ని మంచి సినిమాలతో రవితేజ ఎప్పటికీ లాగే ఎంటర్టైన్ చేస్తాడని ఆశిస్తూ .. క్రాక్ సినిమా టీమ్ కు శుభాకాంక్షలు