చేయూత చెక్కు పంపిణీ చేసిన డిఐజి రంగనాధ్

229
DIG Ranganath distributed the check

చేయూత పథకం పోలీస్ కుటుంబాలలో కొత్త వెలుగులు నింపుతూ వారికి అండగా నిలుస్తుందని డిఐజి ఏ.వి. రంగనాధ్ అన్నారు.

గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఇటీవల మృతి చెందిన ఎన్. బాబు సతీమణి స్వరూప కు రెండు లక్షల రూపాయల చెక్కును ఆయన అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేయూత పథకం పోలీస్ కుటుంబాలలో కొత్త వెలుగులు నింపుతుందని, ఈ పథకం ద్వారా చనిపోయిన పోలీస్ కుటుంబాల సభ్యులకు పోలీస్ శాఖ ద్వారా అందించే అన్ని రకాల సౌకర్యాలతో పాటు చేయూత అండగా నిలుస్తుందని అన్నారు.

కార్యక్రమంలో పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్, నాయకులు సోమయ్య తదితరులు పాల్గొన్నారు.