హోమ్ గార్డులకు హెల్త్ కార్డులు పంపిణీ చేసిన రామగుండం సీపీ

166
Ramagundam CP distributed health cards to home guards

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి లోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలలో పని చేసే హోంగార్డ్స్ మరియు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల ట్రీట్మెంట్ కోసం, వారి సంక్షేమం కోసం

రామగుండం పోలీస్ కమిషనర్ సి వి సత్యనారాయణ ఆదేశాల మేరకు డిసిపి అడ్మిన్ అశోక్ కుమార్ మరియు ఏఆర్ అడిషనల్ డిసిపి సంజీవ్ పర్యవేక్షణలో హోం గార్డ్స్ ఇంచార్జ్ ఆర్ఎస్ఐ సంతోష్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా లోని

వెన్నెల హాస్పిటల్ మంచిర్యాల్
రాధికా చిల్డ్రన్ హాస్పిటల్ మంచిర్యాల్
మహాదేవ డెంటల్ కేర్ మంచిర్యాల్
సూర్య స్కిన్ హాస్పిటల్ మంచిర్యాల్
ముఖేష్ హాస్పిటల్ మంచిర్యాల్

లలో ఆరోగ్య సమస్య కి సంబందించిన చికిత్స సమయంలో హాస్పిటల్ లలో ఫీజు రాయితి గురించి సంబంధిత హాస్పిటల్ డాక్టర్స్ తో మాట్లాడి అమౌంట్ సాయంగా హోం గార్డ్స్ మరియు వారి కుటుంబ సభ్యులకు సహాయం చేయాలని కోరడం జరిగింది.

డాక్టర్ సానుకూలంగా స్పందించి హాస్పటల్ ఖర్చులలో రాయితీ ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించిన హెల్త్ కార్డ్స్ నీ హోంగార్డులకి సిపి గారి చేతులమీదుగా అందజేయడం జరిగింది.

అడగగానే హాస్పిటల్ ఖర్చులు రాయితీ ఇవ్వడానికి ఒప్పుకున్న డాక్టర్లకి సీపీ గారు కృతజ్ఞతలు తెలియజేసి అభినందనలు తెలిపాడం జరిగింది.

ఈ కార్యక్రమంలో డిసిపి అడ్మిన్ అశోక్ కుమార్, అడిషనల్ డిసిపి ఏఆర్ కమాండెంట్ సంజీవ్, ఏఆర్ ఎసిపి నాగయ్య, సుందర్ రావు, ఆర్ ఐ లు మధుకర్, అనిల్,శ్రీధర్ ఆర్ఎస్ఐ సంతోష్, డాక్టర్ లు శ్రీకాంత్, సుదర్శన్ గౌడ్ ముకేశ్ హాస్పిటల్ మంచిర్యాల, రామగుండం పోలీస్ సంఘము అధ్యక్షులు పోచలింగం పాల్గోన్నారు.