నితిన్ ఇప్పటికి ఒక భారీ హీట్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు… మంచి మాస్ డైరెక్టర్ చేతిలో పడితే మాత్రం తన సత్తా ఏంటో తెలుస్తుంది అంటూ ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు… రీసెంట్ గా బిష్మ తో హీట్ కొట్టినప్పటికి కమర్షియల్ గా తనకు రావాల్సిన పేరు రాలేదు.
అయితే. ఇప్పటివరకు ఎంటర్ టైనింగ్ తో అలరిస్తూ వస్తోన్న టాలీవుడ్ హీరో నితిన్ మొదటి సారిగా మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించేందుకు రెడీ అయ్యాడు. తొలిసారిగా ట్రిపుల్ రోల్‌లో కనిపించనున్నాడు నితిన్.
ఈ చిత్రానికి గాను ‘పవర్‌పేట్ ‘ అనే మాస్ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు టాక్. తాజా సమాచారం ప్రకారం..నితిన్ 20 ఏండ్లు, మధ్యవయస్కుడు, 60 సంవత్సరాల వ్యక్తి పాత్రల్లో కనిపించనున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం దర్శకుడు కృష్ణచైతన్య బాలీవుడ్ నుండి మేకప్ ఆర్టిస్ట్ రషీద్‌ను రంగంలోకి దించుతున్నాడట. అంటే దీన్ని బట్టి నితిన్ ఈ సినిమాలో డిఫెరెంట్ గా కొత్తగా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది.
83 చిత్రంలో రణ్ వీర్ సింగ్ ను కపిల్‌దేవ్‌గా మార్చింది మేకప్ డిజైనర్ ఈ రషీదే కావడం విశేషం.. అంతేకాదు రషీద్ ఇటీవలే నితిన్ కు లుక్ టెస్ట్ కూడా చేసి చూడగా..మంచి ఫలితాలు కనిపించాయట. నితిన్- దర్శకుడు కృష్ణచైతన్య అండ్ టీం ఈ వేసవి తర్వాత షూటింగ్‌ను మొదలు పెట్టేందుకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం.
నితిన్ ప్రస్తుతం మూడు సినిమాలు, రంగ్‌దే, చెక్, అంధాధున్ రీమేక్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో రంగ్‌దే త్వరలో నే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అందాదున్ సినిమా కూడా డిఫెరెంట్ క్యాటగిరి కి చెందిందే కావడం..
ఒక్కడున్నాడు. సహసం , ఐతే ప్రయాణం అనుకోకుండా ఒకరోజు, మనమంతా లాంటి డిఫెరెంట్ సినిమాల డైరెక్టర్ తో చెక్ సినిమా చేస్తుంటే.. నితిన్ తను చేసే కథల పట్ల ఎంత జాగ్రత్తా గా ఉన్నాడో తెలుస్తుంది..
ఈ సారి అయిన మంచి కమర్షియల్ హిట్టు కొట్టి మరింత బడా హీరోగా తెలుగు ఇండస్ట్రీ లో కొనసాగాలని కోరుకుందాం.