
- రైతుల సంక్షేమామే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం
- త్వరలోనే ఎల్లంపల్లి లిఫ్ట్ పనులు పూర్తి
- గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దేడమే లక్ష్యంగా పాలన
- రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
రైతుల సంక్షేమామే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని, ప్రతి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.
గురువారం రామగుండంలో ఎంపిడిఓ కార్యాలయంలో అంతర్గాం మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల అభున్నతికై పాటుపడుతుందన్నారు. అంతర్గాం మండల పంటపోలాలకు సాగునీరు అందించేందకు ఏర్పాటు చేసిన ఎల్లంపల్లి లిఫ్ట్ పనులు జాప్యం జరుగుతున్నయని మంగళవారం కాళేశ్వర ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని, త్వరలోనే ఎల్లంపల్లి లిఫ్ట్ పనులు పూర్తి చేస్తామని సిఎం చెప్పారని అన్నారు.
రైతుల కోసం ఇటివలనే రైతు వేదికలు ప్రారంభించుకోవడం జరిగిందని, కరోనా నేపద్యంలో మూసివేయబడ్డ పాఠశాలలు ఫ్రిబవరి 1వ తేదిన తెరుచుకోనున్నాయని, కోవిడ్ నింబధనలు పాటిస్తు పాఠశాలలు నిర్వహణ జరుగాలన్నారు.
కరోనా వ్యాక్సిన్ పట్ల ప్రజలు ఎలాంటి అపోహలు పడవద్దని, వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైనదన్నారు.
ఈ సమావేశంలో అంతర్గాం మండల ఎంపిపి దుర్గం విజయ, జడ్పీటిసి ఆముల నారాయణ, జిల్లా కో ఆప్షన్ సభ్యులు దివాకర్ మండల కో ఆప్షన్ సభ్యులు గౌస్ పాషా తహశీల్దార్ బండి ప్రకాష్, ఎంపిడిఓ యాదగిరితో పాటు సర్పంచ్లు,ఎంపిటిసిలు పాల్గొన్నారు.