క్రాక్ డైరక్టర్ తో బాలయ్య ఊర మాస్ కాంబో సెట్టయేనా?

163
balaiah next movie with krack director

నటసింహం బాలకృష్ణ సినిమాలకు సెపరేట్ ప్యాన్ బేస్ ఉంది. థియేటర్ లో ఆయన డైలాగ్స్, ఫైట్స్ కైతే అభిమానుల కేరింతల గోల మామూలుగా ఉండదు మరి.

నందమూరి నటసింహం బాలకృష్ణ నుంచి ఒక సరైన మాస్ సినిమా పడితే దాని ప్రభావం ఏ రేంజ్ లో ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

మరి అలాంటిది ఇప్పుడు ,బాలయ్య ఆల్ టైం హిట్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి హ్యాట్రిక్ సినిమాను చేస్తున్నాడు . ఇంకా టైటిల్ అయితే ఫిక్స్ కానప్పటికీ , టీజర్ తో మాత్రం భారీ భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరి ఇదిలా ఉంటే ఈ రెండు రోజులు నుండి నందమూరి బాలయ్య మరో సెన్సేషనల్ మాస్ కాంబోను సెట్ చేసారని ఇండస్ట్రీలో టాక్ గట్టిగానే వినిపిస్తుంది. అదే రవితేజ కెరీర్ లోనే బిగెస్ట్ హీట్ గా నిలిచిన లేటెస్ట్ మాస్ హిట్ “క్రాక్” దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి ఓ సినిమా ఫిక్స్ అయ్యినట్టు ఇపుడు సమాచారం.

అంతే కాకుండా మరో ఆసక్తికర వార్త కూడా ఇప్పుడు చక్కర్లు కొడుతుంది, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాతలు గా వహించనున్నారని మరో టాక్ మొదలయ్యింది. మొత్తానికి అయితే మాత్రం ఈ కాంబో లో ఎలాంటి సినిమా వస్తుందో కానీ ఈ వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది.