మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం “ఆర్ఆర్ఆర్” చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. అయితే చరణ్ తరువాత చిత్రం విషయమై సస్పెన్స్ నెలకొంది. కాగా చరణ్ నెక్స్ట్ మూవీ క్రేజీ మల్టీస్టారర్ అంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
తాజా సమాచారం ఏంటంటే చరణ్ తరువాత మూవీ శంకర్ తోనే ఉండబోతోంది. రామ్ చరణ్ తన 15వ చిత్రాన్ని శంకర్ డైరెక్షన్ లోనే చేయబోతున్నాడని, దాన్ని దిల్ రాజు నిర్మిస్తారని వార్తలు వస్తున్నాయి.
శంకర్ ఇప్పుడు కమల్ హాసన్ తో ‘భారతీయుడు -2’ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నాడు. అయితే కొన్ని సమస్యల కారణంగా ఆ ప్రాజెక్ట్ ను ఇప్పుడు ఆపేశారు.
దాంతో ఓ హిస్టారికల్ మల్టీస్టారర్ మూవీకి శ్రీకారం చుట్టడానికి దర్శకుడు శంకర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ముందుగా రామ్ చరణ్ తో పాటు పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్ట్ లో భాగం చేయాలనుకున్నారట.
కానీ పవన్ వరుస చిత్రాలకు కమిట్ అవ్వడంతో కన్నడ స్టార్ హీరో యశ్ ను అప్రోచ్ అయినట్టు సమాచారం.
చెర్రీ-యశ్ ల కాంబినేషన్ లో ఈ ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియన్ మూవీ తెరకెక్కబోతోందని తెలుస్తోంది. వచ్చే యేడాదిలో షూటింగ్ ను దిల్ రాజు మొదలు పెడతారని అంటున్నారు.
మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది.