అభిమానులకు షాకిచ్చిన అనుపమ… ఎంగేజ్డ్…!

170
Anupama Parameshwaran

సౌత్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తాజాగా తన అభిమానులకు షాకిచ్చింది. “ఎంగేజ్డ్” అంటూ ఓ పిక్ ను ఉష మీడియాలో పోస్ట్ చేసింది.

అందులో అనుపమ వేలికి ఉంగరం కూడా ఉంది. దీంతో ఆమె అభిమానులు అవాక్కయ్యారు. అయితే ఆ ఉంగరం తొడిగింది మాత్రం ఓ చిన్న పాప.

Anupama Parameshwaran "ENGAGED"?

ఇప్పటికే అనుపమ ప్రేమ వ్యవహారంపై పలు వార్తలు రాగా… ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ కేరళ కుట్టి వయస్సు ఇప్పుడు 24 ఏళ్ళు మాత్రమే. కాబట్టి ఇప్పుడే నిశ్చితార్థం, పెళ్లి ఆలోచనలు చేయకపోవచ్చని భావిస్తున్నారు.

ఈ బ్యూటీ గత సంవత్సరం ఓ మలయాళ సినిమాకు అసిస్టెంట్ డైరెక్షన్ కూడా చేసింది అనుపమ. త్వరలోనే ఈ బ్యూటీ దర్శకత్వం కూడా వహిస్తుందేమో చూడాలి.

2019లో ‘రాక్షసుడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది అనుపమ. గత సంవత్సరం ఆమె నుంచీ ఒక్క సినిమా కూడా రాలేదు.

ప్రస్తుతం తెలుగులో అనూ ఒక్క సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

అయితే ఇప్పటికే తమిళ, కన్నడ సినీ రంగాల్లో కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఇక ఇటీవలే ఈ బ్యూటీ “మిడ్ నైట్ ఫ్రీడమ్” అనే షార్ట్ ఫిల్మ్ లో నటించింది.

ప్రేక్షకుల నుంచి ఈ షార్ట్ ఫిల్మ్ కు విశేషమైన స్పందన లభించింది.