ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్… కన్ఫర్మ్ చేసిన నిర్మాతలు

221
Mythri Movie Makers confirm NTR’s collaboration with Prashanth Neel

ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా రాబోతోందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

“కేజిఎఫ్”తో భారీ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ “కేజిఎఫ్-2” తరువాత ఎన్టీఆర్ తో చేస్తాడని అంతా అనుకున్నారు.

కానీ ఆయన ప్రభాస్ తో “సలార్” చిత్రాన్ని ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లినట్టైంది.

తాజాగా ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ పై ఓ కీలకమైన అప్డేట్ వచ్చింది. ఇటీవల “ఉప్పెన” సినిమా ప్రమోషన్లలో జరిగిన ఇంటర్వ్యూలో

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్ మాట్లాడుతూ ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సినిమాను కన్ఫర్మ్ చేశారు.

“సలార్” చిత్రం తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని, అంతవరకు ఎన్టీఆర్ త్వరలోనే “ఆర్ఆర్ఆర్” షూటింగ్, త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 30వ చిత్రాన్ని పూర్తి చేస్తారని వారు తెలిపారు.

దీంతో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చినట్లైంది. ఇక ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది.

ఇక ఇందులో హీరోయిన్ గా ఎవరు నటిస్తారో చూడాలి. ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులకైతే ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.