బెల్లంకొండ ‘రాక్షసుడు’ ట్రైలర్‌ విడుదల

285
bellam konda movie trailer

బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తోన్న తాజా చిత్రం రాక్ష‌సుడు. రైడ్, వీర చిత్రాల ఫేమ్ రమేష్‌వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మిస్తున్న ఈ మూవీ తమిళ హిట్ చిత్రం రాచ్చసన్ కు తెలుగులో రీమేక్. రాక్షసుడు లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ ఆఫీస‌ర్‌ పాత్రలో కనిపిస్తున్నాడు.‘నేనంటే భయానికే భయం..నన్ను పట్టుకోవాలనుకోకు. పట్టుకుందామనుకున్నా అది నేనవ్వను..మనం వెతుకుతున్నవాడు రేపిస్టో..కిడ్నాపరో..లేకపోతే వన్ సైడ్ లవరో కాదు..పథకం ప్రకారం హత్యలు చేసే ఓ మతిస్థిమితం లేని వ్యక్తి’ అంటూ వచ్చే డైలాగ్స్ తో ప్రారంభమయే ట్రైలర్ ఆద్యంతం సస్పెన్స్ గా కొనసాగుతోంది.

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. హ‌వీష్ లక్ష్మణ్ కోనేరు ప్రొడక్షన్‌లో ఏ స్టూడియో పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.