ఈ రోజు రాశి ఫలితాలు–శుక్రవారం 19 జులై 2019

319
today rashi phalalu

మేష రాశి : ఈ రోజు ఉత్సాహంగా ఉంటారు. మంచి ఆహారం, మిత్రులతోకలిసివిహారయాత్రకు వెళ్తారు. ఆరోగ్యం బాగుంటుంది. అయితే గర్వానికి, అహంకారానికి తావివ్వకండి. అత్యుత్సాహానికిపోయి చేసేపనుల వల్ల ఇబ్బందిపడే అవకాశముంటుంది. పుకార్లను. చెప్పుడు మాటలనుపట్టించుకోకండి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.

వృషభ రాశి : ఈ రోజు కొత్త పనులు ప్రారంభించటానికి, వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయటానికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులుపూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ విషయంలో పదోన్నతికి సంబంధించినప్రయత్నం ఒక కొలిక్కివస్తుంది.

మిథున రాశి : ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో, గృహ, భూ సంబంధ లావాదేవీల్లో కొంత జాగ్రత్త అవసరం. తొందరపడి పెట్టే పెట్టుబడుల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. అలాగేమీ శతృవుల విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. వారికారణంగా మీపై అధికారులుకానీ, రాజకీయనాయకులుకానీమీకుఇబ్బంది కలిగించవచ్చు.

కర్కాటక రాశి : ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేతులు, చెవులు , తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడేఅవకాశం ఉంటుంది. చేపట్టిన ప్రయాణాలు మధ్యలోఆపలసి రావడంకానీ, ఏదైనా అడ్డంకి ఎదురవడం కానీ జరగవచ్చు. ఇతరులతో వ్యవహరించేప్పుడు కొంత జాగ్రత్త అవసరం. అనవసర వివాదాలు ఏర్పడవచ్చు.

సింహ రాశి : ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలుతగ్గుతాయి. మీ పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీజీవిత భాగస్వామి కోసం లేదా కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఖర్చుచేస్తారు. పెట్టుబడులకు సామాన్యదినం. చర్చలకు, కమ్యూనికేషన్లకు

కన్య రాశి : ఈ రోజు ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. గృహసంబంధ వ్యవహారాల్లో బిజీగా గడుపుతారు. మీతల్లిగారి తరపు బంధువులను కలుసుకోవడం జరుగుతుంది. మీ గృహానికి సంబంధించి కొనుగోలు వ్యవహారాలు లేదా ఇతర లావాదేవీలు ఒక కొలిక్కివస్తాయి. కోర్టు కేసులు కానీ, వివాదాలు కానీ పరిష్కరించబడతాయి.

తుల రాశి : ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మానసికంగా కొంత ఆందోళనగా ఉంటుంది. ఆహారవిషయంలోజాగ్రత్త అవసరం. దూరప్రయాణం కానీ, ఉద్యోగంలో మార్పు కానీ ఉంటుంది. ప్ర యాణాల్లోజాగ్రత్త అవసరం. దైవదర్శనం చేసుకోవడంకానీ, ఆధ్యాత్మికక్షేత్రాల్ని సందర్శించటంకానీ చేస్తారు.

వృశ్చిక రాశి : ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహనకొనుగోలు లేదా భూసంబంధ వ్యవహారాలు ఒకకొలిక్కివస్తాయి. ఆర్థికంగా కొంత సామాన్యంగాఉంటుంది. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి. ప్రశాంతంగా ఉంటేనే పనులుచేయగలుగుతారు.

ధనుస్సు రాశి : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీవృత్తిపరంగా మంచి గుర్తింపు పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్లు లేదా ట్రాన్సఫర్ల కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ రోజు ముఖ్య సమాచారం అందుతుంది. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. పెట్టుబడులకు అనుకూలదినం.

మకర రాశి : ఈ రోజు మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. పనిచేయటానికి బద్ధకిస్తారు. అలాగే ముఖ్యమైన పనులు వాయిదావేసే అ వకాశముంటుంది. ఆహారవిషయంలోజాగ్రత్త అవసరం. అలాగే బంధువులతోమాటకారణంగా సమస్య వచ్చే అవకాశముంటుంది. దూరప్రయాణాల విషయంలో అనుకూలంగా ఉంటుంది.

కుంభ రాశి : ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది. మొండిబకాయిలువసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అత్యుత్సాహానికి పోకుండా, ఆలోచనతో పనులు పూర్తి చేయండి.

మీన రాశి : ఈ రోజు కొంతబద్ధకంగా ఉంటుంది. ఏ పని అయినా వాయిదా వేయడం చేస్తారు. మీసహోద్యోగులకారణంగా కొంత అసూయకు, ఆవేశానికి లోనవుతారు. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవడంమంచిది. ఖర్చుల విషయంలోఆచి, తూచి అడుగేయండి. అలాగే ఇతరులతో వ్యవహరించేప్పుడు జాగ్రత్త అవసరం.