బాలీవుడ్ సీనియర్ నటుడు రాజీవ్ కపూర్ కన్నుమూత

233
Rajiv Kapoor passes away

బాలీవుడ్ సీనియర్ నటుడు, రిషి కపూర్ సోదరుడు రాజీవ్ కపూర్ ఫిబ్రవరి 9న మధ్యాహ్నం గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 58 సంవత్సరాలు.

ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

కొద్దిసేపటి క్రితం రాజీవ్ కపూర్‌కి గుండెపోటు రావడంతో చెంబూర్ లోని వారి నివాసానికి సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. వైద్యం చేస్తుండగానే హాస్పిటల్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు.

1991లో “హెన్నా” అనే హిట్ మూవీకి నిర్మాతగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు రాజీవ్ కపూర్. “ప్రేమ్ గ్రంథ్” సినిమాతో దర్శకుడిగా మారారు.

రామ్ తేరి గంగా మెయిలీ, మేరా సాతి, హమ్ టు చాలే పార్డెస్ వంటి సినిమాల్లో నటించి నటుడిగా కూడా సత్తా చాటారు.

రాజీవ్ కపూర్ మరణవార్త తెలిసి కరీనా కపూర్, కరిష్మా కపూర్ సహా కపూర్ ఫ్యామిలీ మొత్తం ఆయన నివాసం వద్దకు చేరుకుంటున్నారు.

కాగా గతేడాది రిషి కపూర్ మృతి చెందారు. ఏడాది తిరగకముందే కపూర్ ఫ్యామిలీలో మరో విషాదం చోటు చేసుకోవడం విషాదకరం.