“సే ఎస్‌ టు ఇన్‌హెలర్స్” అంటున్న కాజల్

177
Kajal Aggarwal opens up about being diagnosed with asthma at 5

చందమామ కాజల్ అగర్వాల్ దశాబ్ద కాలంగా సౌత్ లో సౌత్ హీరోయిన్ గా సత్తా చాటుతోంది. కాజ‌ల్ అగ‌ర్వాల్ వెండితెర ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లు పైనే అయింది.

ఈ బ్యూటీ ఇటీవల కాజల్ తన ప్రియుడు గౌతమ్ కిచ్లుని పెళ్లాడింది. ఆ తరువాత నుంచి వీరికి సంబంధించిన రొమాంటిక్ టూర్స్, ఫోటోలు వైరల్ అవుతుండడంతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

ఈ నేపథ్యంలో కాజల్ తనకు చిన్నతనంలోనే బ్రాంకియల్‌ ఆస్తమా ఉందని తెలియడంతో ఎప్పుడూ ఇన్‌హెలర్స్‌ ఉపయోగిస్తుంటా అని చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు శీతాకాలం వచ్చిందంటే చాలు బ్రాంకియల్‌ ఆస్తమా లక్షణాలతో ఇబ్బంది పడేదాన్నని చెప్పుకొచ్చింది కాజల్.

అయితే ఇన్‌హెలర్స్‌ వాడటంతో కాస్త ఉపశమనం పొందేదాన్నని, పబ్లిక్‌గా, ప్రైవేట్‌గా ఇన్‌హెలర్స్‌ ఉపయోగించడంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదని కాజల్ పేర్కొంది.

‘సే ఎస్‌ టు ఇన్‌హెలర్స్‌’ అంటూ తన ఇన్స్‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్ పెట్టింది.

ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ‘మోసగాళ్లు’, ‘భారతీయుడు 2’, ‘ఆచార్య’ చిత్రాల్లో నటిస్తోంది.

ఇక కాజ‌ల్ న‌టించిన ‘లైవ్‌ టెలికాస్ట్‌’ అనే వెబ్‌ సిరీస్ ఫిబ్ర‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

పెళ్ళి తరువాత కూడా వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది కాజల్.