గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ?

159
Gopichand Malineni to direct Balakrishna

నందమూరి బాలకృష్ణ, “క్రాక్”తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ విషయమై చర్చలు నడుస్తున్నాయి.

బాలయ్య ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని సమాచారం. ఈ సినిమాను ఏప్రిల్ నెలలో ఉగాది సందర్భంగా అధికారికంగా ప్రకటించనున్నారట.

అన్నీ ఓకే అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలో ఉంటుందని టాక్.

దర్శకుడు గోపీచంద్ మలినేని “క్రాక్” సినిమాతో ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. మాస్ మహారాజా రవితేజతో హ్యాట్రిక్ కొట్టారు. ఇప్పుడు బాలకృష్ణ కోసం గోపీచంద్ ఎలాంటి స్క్రిప్ట్ సిద్ధం చేశారో చూడాలి.

గోపీచంద్ మలినేని లాంటి మాస్ డైరెక్టర్‌తో బాలకృష్ణ సినిమా అంటే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి.

ఇక బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను మే 28న విడుదల చేయనున్నట్టు నిర్మాత ప్రకటించారు.

తమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ ఒక హీరోయిన్‌గా నటిస్తున్నారు. ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.