విశాఖపట్నం రౌడీ వాల్తేరు శ్రీనుగా సుమంత్… !

169
First Look: Sumanth As Rowdy Waltair Seenu

యంగ్ హీరో సుమంత్ అక్కినేని వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మను యజ్ఞ దర్శకత్వంలో సుమంత్ నటిస్తున్న తాజాగా చిత్రం “అనగనగా ఒక రౌడీ”.

ఐమా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మధునందన్, ధన్‌రాజ్, కళ్యాణ్ చక్రవర్తి, హైపర్ ఆది, మిర్చి కిరణ్, ప్రభ తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని ఏక్‌దోతీన్ ప్రొడక్షన్స్ పతాకంపై గార్లపాటి రమేష్, డా.టీఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం మార్క్ కె. రాబిన్ సమకూరుస్తున్నారు.

ఈరోజు సుమంత్ పుట్టినరోజు సందర్భంగా “అనగనగా ఒక రౌడీ” చిత్రం నుంచి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు చిత్రబృందం. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ చిత్రంలో విశాఖపట్నం రౌడీ వాల్తేరు శ్రీనుగా సుమంత్ కనిపించనున్నారు. వైజాగ్‌లో జరిగే చివరి షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తి కానుంది.

కాగా వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సుమంత్ సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.

సుబ్రహ్మణ్యపురం, ఇదంజగత్ సినిమాలతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన సుమంత్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు.

వాటిలో అనగనగా ఒక రౌడీ, కపటధారి సినిమాలు ఉన్నాయి. కాగా ఫిబ్రవరి 19న విడుదలవుతోంది.