ఏడాది పూర్తి చేసుకున్న “ఆహా”… అల్లు అరవింద్ ప్రత్యేక లేఖ

136
Aha OTT Completes One Year

తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం “ఆహా” ప్రారంభమై ఏడాది పూర్తి అయ్యింది.

ఈ సందర్భంగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ లేఖను విడుదల చేశారు.

ప్రేక్ష‌కుల‌ను ప్రియ‌మైన కుటుంబ స‌భ్యులు అంటూ లేఖను ప్రారంభించారు అల్లు అరవింద్. ” ఈ రోజు ఆహా అనేది ఓ పెద్ద కుటుంబం అయినందుకు చాలా సంతోషంగాను, గ‌ర్వంగానే ఉంది.

మీ ప్రేమ ఆద‌ర‌ణ వల్లే ఈ రోజు ఆహా మొద‌టి వార్షికోత్స‌వం చేసుకుంటోంది. ఈ “ఆహా” కుటుంబంలో మనం అందరం కుటుంబ సభ్యులమే కదా” అంటూ లేఖను పోస్ట్ చేశారు ఆయన.

కాగా “ఆహా”లో సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటు పలు షోలు కూడా ప్రసారం అవుతున్నాయి. అయితే ఇందులో పూర్తిగా తెలుగుకే ప్రాధాన్యత ఇవ్వడంతో “ఆహా”కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది.

“ఆహా”లో స్టార్ హీరోయిన్ సమంత హోస్ట్ గా వ్యవహరిస్తున్న “సామ్ జామ్”కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది.

కాగా “ఆహా” ఏడాది పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు ప‌లువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.