దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ని ఖర్గార్ ప్రాంతంలో దారుణం జరిగింది. 19 ఏళ్ల యువతిపై ఇద్దరు స్నేహితులు అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ ఘటన నవీ ముంబైలోని ఖర్గార్ ప్రాంతంలో జరిగింది. యువతిపై అత్యాచారం చేసిన ఇద్దరు యువకుల్లో ఒకరు డ్రైవర్ కాగా, మరొకరు పిజ్జా డెలివరీ బాయ్.
పోలీసుల కథనం ప్రకారం బైక్ డ్రైవింగ్ నేర్పిస్తామని చెప్పి సదరు యువతిని డ్రైవర్ తీసుకొచ్చాడు. మద్యం తీసుకొచ్చి ఆమెకు బలవంతంగా తాగించాడు.
అనంతరం బస్సులోనే అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత తన స్నేహితుడైన పిజ్చా డెలివరీ బోయ్ ని కూడా పిలిపించాడు. అతడు కూడా ఆమెపై అత్యాచారం జరిపాడు.
ఆ తర్వాత ఇద్దరూ ఆమెను బస్సులోనే వదిలి పారిపోయారు. మరుసటి రోజు ఈ ఘటనపై ఆమె ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు పిజ్జా డెలివరీ బోయ్ ని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.