రాజ‌శేఖ‌ర్ కూతురు సినిమా ఎంట్రీ – ముహూర్తం ఫిక్స్‌

433
rajashekar daughter debut film muhurat

యాంగ్రీ యంగ్ మెన్ రాజ‌శేఖ‌ర్ త‌న‌య శివానీ .. 2 స్టేట్స్ తెలుగు రీమేక్‌తో వెండితెర ఎంట్రీ ఇస్తుంద‌నే సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ ఎప్పుడు లాంచ్ అవుతుందా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, అడ‌వి శేష్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా లాంచింగ్ డేట్ విష‌యాలు తెలియ‌జేశారు. ప్రముఖ రచయిత చేతన్ భగత్ రాసిన నవల ఆధారంగా రూపొందిన హిందీ చిత్రం ‘2 స్టేట్స్’. 2014లో వచ్చిన ఈ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. మళ్లీ మళ్లీ చూడదగ్గ సినిమా ఇది అని విశ్లేషకులు, సినీ ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గీయులు ప్రశంసించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో రీమేక్ అవుతుంది. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ దగ్గర పలు చిత్రాలకు కో–డైరెక్టర్‌గా వ్యవహరించిన వెంకట్ కుంచ‌ తెలుగు రీమేక్ హక్కులు దక్కించుకొని తెరకెక్కిస్తున్నారు. అడవి శేషు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.



 

2 స్టేట్స్ తెలుగు రీమేక్ చిత్రం మార్చి 24న అన్న‌పూర్ణ స్టూడియోలో లాంచ్ కానుంది. ఉద‌యం 8 గం.ల‌కు పూజా కార్య‌క్ర‌మాలు ప్రారంభించి 8.36ని.ల‌కు షూటింగ్ ప్రారంభిస్తారు. అనూప్ రూబెన్స్ చిత్రానికి సంగీతం అందించ‌నుండ‌గా, అడ‌వి శేషు న‌టించిన క్ష‌ణం చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌గా పని చేసిన షానియెల్ డియో 2 స్టేట్స్ రీమేక్ చిత్రానికి పని చేస్తున్నాడు. సినిమాకి ఫ్రెష్ లుక్ వచ్చేందుకు రెగ్యులర్ యాక్టర్స్ ని కాకుండా రేర్ యాక్టర్స్ ని సెలక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ నటి భాగ్యశ్రీ హీరోయిన్ మదర్ పాత్ర పోషిస్తుంది. బాలీవుడ్ నటుడు రజత్ కపూర్ ని శివానీ తండ్రి పాత్ర కోసం ఎంపిక చేశారని టాక్. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతున్నట్టు సమాచారం. హిందీ చిత్రాని నిర్మాణ సంస్థగా వ్యవహరించిన ధర్మ ప్రొడక్షన్స్ ఇప్పటివరకూ తమ సంస్థ నిర్మించిన ఏ చిత్రం రీమేక్ హక్కులను దక్షిణాదికి ఇవ్వలేదు. తొలిసారి ఈ సంస్థ రీమేక్ హక్కులను అమ్మిన చిత్రం ‘2 స్టేట్స్’ కావ‌డం విశేషం.