పాకిస్థాన్‌ కి రమ్మని రాజమౌళికి పిలుపు

270
rajamouli-got-invitation-from-pakistan

దర్శకధీరుడు రాజమౌళికి అరుదైన ఆహ్వానం లభించింది. కరాచీలో నిర్వహించబోయే పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌‌లో పాల్గొనవలసిందిగా రాజమౌళికి పిలుపు వచ్చింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. 

“బాహుబలి నాకు ఎన్నో దేశాలను సందర్శించే అవకాశాన్ని ఇచ్చింది. వాటన్నింటిలో ఇప్పుడు పాకిస్థాన్ నుంచి వచ్చిన ఆహ్వానం స్పెషల్. నన్ను ఆహ్వానించిన పాకిస్థాన్ ఫిలింఫెస్టివల్‌ నిర్వాహకులకు ధన్యవాదాలు” అంటూ రాజమౌళి పోస్ట్ చేశారు.