“రాధేశ్యామ్” నుంచి మరో అప్డేట్

313
Radhe Shyam: Music Director Justin Prabhakaran roped in for Prabhas' film

జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజాహెగ్డే హీరోయిన్ గా “రాధేశ్యామ్” తెరకెక్కుతోంది. 1960 దశకం నాటి ఈ వింటేజ్‌ ప్రేమకథా చిత్రాన్ని గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

“రాధేశ్యామ్” చిత్రంలో సీనియర్ హీరోయిన్ సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, మురళీ శర్మ, భాగ్యశ్రీ, కునాల్ రాయ్ కపూర్, శాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ప్రభాస్ 20వ చిత్రమైన “రాధేశ్యామ్”పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రేమికుల రోజున “రాధేశ్యామ్” నుంచి టీజర్ ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు నిర్మాతలు. తాజాగా మరో అప్‌డేట్‌ను ఇచ్చారు.

ఈ సినిమాలోని మ్యూజిక్ కంపోజర్స్‌ను తెలుపుతూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు.

ఈ సినిమాకు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించగా…

హిందీలో మాత్రం మిథున్ మనన్ భరధ్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ అప్‌డేట్‌ను భారత్ దేశపు మ్యాప్‌పై చూపించడం ఆసక్తికరంగా ఉంది.

అంతేకాకుండా ఇందులో మధ్యలో ట్రైన్ వెళుతున్నట్లు కూడా వెళ్తోంది. సినిమాలో హీరోహీరోయిన్ల జర్నీ ఈ ట్రైన్ లోనే ఉంటుంది కదా.