శివుడు కలలో కనిపించాడని తనను సమాధి చేయాలని ఓ మహిళ కుటుంబ సభ్యులను కోరింది.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది. ఇంటి బయట గొయ్యి తవ్వి అందులో తనను సమాధి చేయాలని ఆమె కుటుంబ సభ్యులను కోరారు.
పోలీసులు సకాలంలో చేరుకుని ఆమెను కాపాడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
ఘటంపూర్ ప్రాంతంలోని సజేటి గ్రామంలో ఈ ఘటన జరగ్గా బాధితురాలిని స్ధానిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పోలీసులు కథనం ప్రకారం..దేవికి చాలా ఏండ్ల కిందట శివభక్తుడైన రామ్ సంజీవన్‌తో వివాహమైంది.
మహాశివరాత్రికి ముందు శివుడు తనకు కలలో కనిపించాడని, ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు తనను సమాధి చేయాలని ఆమె కుటుంబ సభ్యులను కోరింది.
దీంతో ఇంటి బయటే నాలుగు అడుగుల గొయ్యిని తవ్విన కుటుంబ సభ్యులు మంచంపై ధ్యానముద్రలో ఆమెను అందులో దించారు.
గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు మట్టిని బయటకు తీసి మహిళను కాపాడారు.