గతంలో తాను చెప్పిందే నిజమైంది: విజయశాంతి

209

జీహెచ్ఎంసీ మేయ‌ర్‌గా బంజారాహిల్స్ కార్పొరేట‌ర్ కె. కేశవరావు కుమార్తె గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి ఎన్నికైన విషయం తెలిసిందే.

ఎంఐఎం మద్దతివ్వడంతో మేయర్‌, డిప్యూటి మేయర్‌ పదవులను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత విజయశాంతి మేయర్ ఎన్నికపై స్పందించారు.

టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల గురించి గతంలో తాను చెప్పిందే నిజమైందని తెలిపారు.

టీఆర్ఎస్, ఎంఐఎం విడదీయలేని సయామీ కవలలని తాను డిసెంబరు 4న చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.

ఈ రోజు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికతో నిరూపించబడ్డాయని ఆమె వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీలు తమ బంధాన్ని మరోసారి బహిరంగం చేసుకున్నాయని అన్నారు.

గత సవంత్సరం డిసెంబరులో జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు పరిస్థితి చూస్తుంటే ఎంఐఎం మద్దతు లేకుండా టీఆర్ఎస్ కు మేయర్ పీఠం దక్కేలా లేదని పేర్కొన్నారు.

విజయశాంతి అభిప్రాయపడినట్టే నేడు టీఆర్ఎస్ కు మేయర్ పీఠం లభించడంలో ఎంఐఎం మద్దతే కీలకంగా నిలిచింది.