‘పేపర్‌ బాయ్‌’ టీజర్ విడుదల

334
prachitra creations paper boy movie teaser

‘‘ఒక అమ్మాయి, ఓ పేపర్‌ బాయ్‌ మధ్య జరిగే ప్రేమ కథే ‘పేపర్‌ బాయ్‌’. ఈ చిత్రంలో అన్ని ఎమోషన్స్‌ ఉంటాయి. మంచి సబ్జెక్ట్‌ ఉన్న సినిమా. అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. కెమెరామెన్‌ సౌందర్య రాజన్‌ మంచి విజువల్స్‌ అందించారు. భీమ్స్‌ మ్యూజిక్‌ అందరినీ ఆకట్టుకుంటుంది. ఆగస్టులో సినిమా విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత సంపత్‌ నంది అన్నారు. సంతోష్‌ శోభన్‌ హీరోగా, రియా, తాన్య హోప్‌ హీరోయిన్లుగా జయశంకర్‌ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘పేపర్‌ బాయ్‌’. సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌ బ్యానర్లో ప్రచిత్ర క్రియేషన్స్, బిఎల్‌ఎన్‌ సినిమాపై సంపత్‌ నంది నిర్మించారు.




 

ఈ సినిమా టీజర్‌ను రియల్‌ పేపర్‌ బాయ్‌ అఖిల్‌ చేత విడుదల చేయించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జయశంకర్‌ మాట్లాడుతూ– ‘‘నేను చేసిన షార్ట్‌ ఫిల్మ్‌ చూసి సంపత్‌గారు డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. అందుకు ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటా. సింపుల్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన చిత్రమిది. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘గోల్కొండ హైస్కూల్‌’తో బాల్య నటుడిగా నన్ను ఆదరించారు. ఇప్పుడు ‘పేపర్‌ బాయ్‌’గా మీ ముందుకు వస్తున్నా, ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో అందరూ కొత్తవారే’’ అన్నారు సంతోష్‌ శోభన్‌. నిర్మాత నరసింహ, కథానాయిక రియా పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మురళి మామిళ్ల.

 

 

సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌లో రెండో ప్రయత్నంగా తెరకెక్కిన పేపర్ బాయ్ సినిమా టీజర్‌ విడుదలైంది. రామ్‌చరణ్‌, రవితేజ, గోపిచంద్ లాంటి హీరోలతో మాస్‌ కమర్షియల్ ఎంటర్‌టైనర్లను తెరకెక్కించిన సంపత్‌ తన స్వీయ నిర్మాణంలో సినిమాలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఆది హీరోగా గాలిపటం సినిమాను నిర్మించిన సంపత్‌ నంది తాజాగా తన బ్యానర్‌లో రెండో సినిమాను సిద్ధం చేశాడు.




 

తను నేను సినిమాతో పరిచయం అయిన సంతోష్ శోభన్ హీరోగా జయ శంకర్‌ను దర్శకుడి పరిచయం చేస్తూ పేపర్‌ బాయ్ సినిమాను తెరకెక్కించారు. సపంత్ నంది స్వయంగా కథా కథనాలు అందించిన ఈ సినిమాలో రియా సుమన్‌, తాన్యా హోపేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ ఆడియో, సినిమా రిలీజ్‌ డేట్లు త్వరలోనే వెల్లడించనున్నారు. త్వరలో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.