రూబిక్ క్యూబ్స్‌తో ప్ర‌భాస్ ముఖచిత్రం

420

బాహుబ‌లి సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ రేంజ్ మారింది. ఇప్పుడు ప్ర‌భాస్ కి దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది. ప్ర‌భాస్ న‌టించిన తాజా చిత్రం సాహో కోసం కేవ‌లం తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లే కాదు దేశ వ్యాప్తంగాను, అంత‌ర్జాతీయంగా ఉన్న ప్ర‌భాస్ అభిమానులు క‌ళ్ళ‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి విడుద‌లైన టీజ‌ర్, ట్రైల‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచాయి. ఆ మ‌ధ్య విడుద‌లైన సాహో టీజ‌ర్‌లో ‘వాళ్లు నా ఫ్యాన్స్ కాదు.. డైహార్డ్ ఫ్యాన్స్’ అని ప్రభాస్ చెప్పిన డైలాగ్ చాలా పాపులర్ అయ్యింది.

తాము ప్ర‌భాస్ డైహార్డ్ ఫ్యాన్ అని ప్రూవ్ చేసుకునేందుకు ఒక్కో అభిమాని త‌న‌లోని టాలెంట్‌ని బ‌య‌ట‌కి తీస్తున్నారు. ఒరిస్సాకి చెందిన ప్ర‌భాస్ డై హార్డ్ అభిమాని ఒక‌రు 486 రూబిక్ క్యూబ్స్‌తో 13 గంట‌ల పాటు శ్ర‌మించి ప్ర‌భాస్ ముఖ చిత్రాన్ని త‌యారు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. అతను నిజంగా ప్ర‌భాస్ డైహార్డ్ ఫ్యాన్ అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. సాహో చిత్రం సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా ఈ చిత్రం ఆగ‌స్ట్ 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ మొద‌లు కాగా, టిక్కెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడ‌వుతున్నాయి.