ఈ రోజు రాశి ఫలితాలు–మంగళవారం 27 ఆగస్టు 2019

454
today-friday-30-august-2019-horoscope-details
Today-Rasi-phalitalu-thursday-07-november-2019

శ్రీ వికారి నామ సం।।రం।। దక్షిణాయనం వర్ష రుతువు; శ్రావణ మాసం; బహుళ పక్షం ద్వాదశి: రా.11-05 తదుపరి త్రయోదశి పునర్వసు నక్షత్రం: రా.10.55 తదుపరి పుష్యమి అమృత ఘడియలు: రా.8-36 నుంచి 10-08 వరకు వర్జ్యం: ఉ.11-21 నుంచి 12-54 వరకు దుర్ముహూర్తం: ఉ.8-17 నుంచి 9-07 వరకు తిరిగి రా.10-52 నుంచి 11-38 వరకు రాహుకాలం: సా.3-00 నుంచి 4-30 వరకు సూర్యోదయం: ఉ.5-48; సూర్యాస్తమయం: సా.6.16

మేష రాశి : ఈ రోజు ఇంటిపట్టున ఉండి చాలా రోజుల నుంచి వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. బంధువులను, స్నేహితులను కలుసుకుంటారు. ఇల్లు లేదా భూ సంబంధ లావాదేవీలు పూర్తి చేస్తారు. ఆర్థికంగా అనుకూలంగా కొంత సామాన్యంగా ఉంటుంది.

వృషభ రాశి : ఈ రోజు వ్యాపార వ్యవహారాలకు, ముఖ్యమైన ఒప్పందాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణం చేసే అవకాశం ఉంది. అలాగే విదేశం నుంచి ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. కొత్త పరిచయాలు, స్నేహాలు ఏర్పడతాయి. మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవటం మంచిది.

మిథున రాశి : ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పనులు అనుకున్న విధంగా కాకపోయే సరికి కొంత నిరాశకు లోనవుతారు. ఇతరులతో వ్యవహరించేప్పుడు కొంత జాగ్రత్త అవసరం, లేనిచో అవమానాల పాలవుతారు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనటం కానీ, బాగు చేయించటం కానీ చేస్తారు. ఖర్చు అదుపులో ఉండదు కాబట్టి తొందరపాటు మంచిది కాదు.

కర్కాటక రాశి : ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. మంచి ఆహారం తీసుకోవటం కానీ, నూతన వస్ర్తాలు కొనుగోలు చేయటం కానీ చేస్తారు. మీ జీవితభాగస్వామి నుంచి అనుకోని సహాయం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో ఆచి, తూచి అడుగేయండి.

సింహ రాశి : ఈ రోజు కొంత బద్ధకంగా ఉంటుంది. చిన్న పనికి అయినా ఇతరులపై ఆధారపడటం కానీ, ఇతరుల సాయం తీసుకోవటం కానీ చేస్తారు. ఉద్యోగంలో అనుకోని సమస్య కారణంగా ఆందోళనకు గురవుతారు. అలాగే మిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశముంటుంది.

కన్య రాశి : ఈ రోజు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అనుకోని ధనాదాయం ఉంటుంది. మీ స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. చాలాకాలం నుంచి ఎంత ప్రయత్నం చేసినా కాని పనులు ఈ రోజు ఏ ప్రయత్నం లేకుండానే పూర్తవుతాయి. గృహసంబంధ ఒప్పందాలు పూర్తి చేస్తారు.

తుల రాశి : ఈ రోజు మీరు చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో అనుకూల మార్పు ఉంటుంది. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. మీ పై అధికారులనుంచి అనుకోని బహుమతి అందుకుంటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మీ సం తానం కారణంగా మీరు ఆనందాన్ని, గుర్తింపును పొందుతారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

వృశ్చిక రాశి : ఈ రోజు మీరు రోజువారీ కార్యక్రమాల నుంచి విశ్రాంతిని కోరుకుంటారు. ఒకే రకమైన అనుకోని ప్రయాణం కానీ, కొత్త వ్యక్తులను కలుసుకోవటం కానీ జరుగుతుంది. మానసికంగా ఏదో తెలియని అలజడిని, వెలితిని కలిగి ఉంటారు. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మార్పు కోరుకుంటారు.

ధనుస్సు రాశి : ఈ రోజు చేపట్టిన పనుల్లో అనుకోని అడ్డంకుల కారణంగా మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ఆవేశానికి లోనవకుండా స్థిమితంగా ఉండటం మంచిది. ఆర్థిక స్థితి సామాన్యంగా ఉంటుంది. పెట్టుబడులకు, కొనుగోళ్లకు అనుకూమైన రోజు కాదు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఎదుటివారిని నమ్మి డబ్బులు ఇవ్వకండి.

మకర రాశి : వివాహ సంబంధ వ్యవహారాలకు, ఒప్పందాలకు అనుకూల దినం. మీ మనసులోని భావాలను మీ జీవితభాగస్వామికి వ్యక్తం చేస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో కలిసి సినిమా లేదా ఇతర వినోద కార్యక్రమాలకు వెళతారు. బంధువులతో లేదా మిత్రులతో ఉన్న గొడవలు సమసిపోతాయి.

కుంభ రాశి : ఆర్థికంగా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. రావలసిన పాత బకాయిలు రావటం కానీ, లోన్‌ రావటం కానీ జరుగుతుంది. ఉద్యోగం విషయంలో ఎదురు చూస్తున్న వారికి కొంత అనుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. వ్యాపార విషయాలకు కొంత సామాన్యంగా ఉంటుంది. కోర్టు కోసులు, వివాదాల్లో విజయం సాధిస్తారు.

మీన రాశి : ఈ రోజు ప్రేమను లేదా మీ అభిప్రాయాన్ని వ్యక్త పరచటానికి అనుకూలంగా ఉంటుంది. మానసికంగా కొంత ఆందోళన, ఉత్సాహం కలగలుపుగా ఉంటాయి. మీ సంతానం ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. పెట్టుబడులకు, ఆర్థిక లావాదేవీలకు అంతగా అనుకూలమైన రోజు కాదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.