బాలీవుడ్ హ్యాండ్‌సమ్ హీరో హృతిక్ రోషన్, యాక్షన్ హీరో జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘వార్’. వాణీ కపూర్ హీరోయిన్‌గా యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 2న చిత్రం విడుదల కానుంది. హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. టీజర్‌లో హృతిక్, టైగర్ స్టంట్స్ చూసి తెలుగు ప్రేక్షకులు వావ్ అన్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఇందులోని సీన్స్ ప్రేక్షకుల రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తున్నాయి. వీళ్ళిద్దరు చేసిన రియల్ స్టంట్స్ ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి.