స్విమ్మింగ్ లో ప్రతిభ చూపిస్తున్న పోలీస్

608
police-talent-in-swimming

సరదాగా నేర్చుకున్న ఈత జాతీయ స్థాయి ఈత పోటీలలో పాల్గొనేల చేసింది. పోలీస్ ఉద్యోగాన్ని ఇచింది. అందుకే ఐ లవ్ యు స్విమ్మింగ్ అంటున్నాడు గోదావరిఖని కి చెందిన ఎ ఆర్ కానిస్టేబుల్ అల్లం లక్ష్మినారాయణ. క్రీడలు శారీరక , మానసిక ఉల్లాసానికే కాదు .. జీవితంలో గెలవడానికి మనకు ధైర్యాన్ని కల్పిస్తాయి అంటున్నాడు ఈ సూపర్ పోలీస్.




సరదాగా నేర్చుకున్న ఈత

ఎన్టీపీసి లో నివాసం ఉంటున్న ఎ ఆర్ కానిస్టేబుల్ అల్లం లక్ష్మినారాయణ ప్రస్తుతం రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సి ఐ వాహన డ్రైవర్ గా పని చేస్తున్నాడు. 10వ తరగతి చదువుకునే వయసు లో ఇంటి పక్కనుండే నర్సయ్య స్విమ్మింగ్ పూల్ లో నేర్పిన ఈత సరదాగానే అనుకున్నాడు. కాని ఈత లో రాష్ట్ర స్థాయి పోటిలలో తలపడ్డాక తెలిసింది. ఈత లో అనేక విజయాలు సాధించవచ్చని. లక్ష్మినారాయణ పట్టుదల చూసిన కోచ్ రాజవీర్ స్పందించి మరిన్ని మెళకువలు నేర్పించాడు. దీంతో రాష్ట్ర స్థాయిలో 100 మీటర్ల విభాగంలో సత్తా చాటాడు.

పోలీస్ ఉన్నతాధికారులు , కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తోనే స్విమ్మింగ్ లో మెడల్స్ సాధించా.

పోలీస్ ను చేసిన స్విమ్మింగ్ ప్రతిభ

పోలీస్ ఉన్నతాధికారులు , కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తోనే స్విమ్మింగ్ లో మెడల్స్ సాధించా. భార్య రమాదేవి నాకు ఎనర్జీ. నా కోసం చాల కష్టపడుతుంది. ఎ ఆర్ ఇన్స్పెక్టర్ మధుకర్ సర్ కూడా క్రీడకు ఎంకరేజ్ చేసారు. సీపీ విక్రం సర్ రివార్డ్ ప్రకటించి శాలువాతో సత్కరించి అభినందించారు.

కర్నూల్ లోని తుంగభద్ర డ్యాంలో లక్ష్మినారాయణ 27 కిలోమీటర్ల నాన్ స్టాప్ స్విమ్మింగ్ పోటిలలో పాల్గొని బెస్ట్ ఫర్ 10 లో
ఒకరిగా నిలిచారు. ఈ బ్రేక్ తన జీవితాన్నే మార్చేసింది. జాతీయ మీడియా కూడా లక్ష్మినారాయణ ప్రతిభ పై మంచి కథనాలు ప్రచురించాయి. ఐ టి ఐ లక్ష్మినారాయణ 1995 లో పోలీస్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈ ఉద్యోగానికి ఎంపిక కావడానికి ఈత పోటిలో సాధించిన విజయాలు దోహదపడ్డాయని ఆయన వెల్లడించాడు.

జాతీయ స్థాయి పోటీలో ….

పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపికైన లక్ష్మినారాయణ ట్రైనింగ్ పీరియడ్ నుంచే పోలీస్ క్రీడా పోటీలలో పాల్గొంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. న్యూ ఢిల్లీ, పంజాబ్, గోవా, అండమాన్ నికోబార్ , మహారాష్ట్ర , శ్రీనగర్, బెంగుళూర్ , కేరళ తదితర రాష్ట్రాలలో జరిగిన జాతీయస్థాయి ఈత పోటీలలో పాల్గొని ప్రతిభను చాటుకున్నారు. స్థానిక గోదావరి నది లో ఓ ఎ ఆర్ కానిస్టేబుల్ తో పాటు మరో వ్యక్తి ప్రమాదవశాత్తు మునిగిపోయి చనిపోతే లక్ష్మినారాయణ రాత్రంతా గాలించి ఓ మృత దేహాన్ని గుర్తించి వెలికి తీసారు.


సాధించిన పథకాలు ..

పోలీస్ క్రీడా పోటిలలో తనదైన ప్రతిభ చాటుకుంటున్న కానిస్టేబుల్ లక్ష్మినారాయణ తన 22 సంవత్సరాల సర్వీసులో ఇప్పటి వరకు 19 గోల్డ్ మెడల్స్ , 26 సిల్వర్ మెడల్స్ పొందగా 28 టోర్నమెంట్లలో థర్డ్ ప్లేస్ లో నిలిచారు. పోలీస్ ఉన్నతాధికారుల చేతుల మీదుగా 11 రివార్డ్ లు , 4 ప్రశంసాపత్రాలను అందుకున్నారు.