“కోటి వృక్షార్చన”కు సూపర్ స్టార్ మద్దతు

218
Planting trees is best way to reduce global warming : Mahesh Babu

ఎంపీ జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రస్తుతం విజయవంతంగా సాగుతోంది.

పలువురు సినీ, రాజకీయ సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో భాగమవుతూ తమవంతుగా మొక్కలు నాటుతున్నారు.

గ్రీన్ ఎంపీ జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈ నెల 17న కోటి వృక్షార్చన అంటూ కోటి మొక్క‌ల‌ను నాటే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌బోతున్నారు.

ఈ బృహత్తర కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేష్‌ బాబు సైతం మద్దతు తెలిపారు.

కూతురు సితార, కొడుకు గౌతమ్, మహేష్ బాబు మొక్కలు నాటుతున్న దృశ్యాలతో కూడిన వీడియో షేర్ చేస్తూ “గ్లోబల్‌ వార్మింగ్‌ను తగ్గించడానికి మన దగ్గర ఉన్న ఏకైక మార్గం మొక్కలు నాటడమే” అని ట్వీట్ చేశారు.

యాంకర్ అనసూయ కూడా కోటి వృక్షార్చనకు తన మద్దతు తెలిపింది. “ఈ రాష్ట్రం నాకు ఏమి ఇచ్చింద‌ని కాదు. ఈ రాష్ట్రానికి నేను ఏం ఇచ్చాను అని ఆలోచిస్తున్నారా..?

అయితే రండి. మ‌న భావిత‌రాల కోసం గ్లోబల్ వార్మింగ్, కాలుష్యాన్ని త‌గ్గించేందుకు మనవంతు ప్రయత్నంగా ఫిబ్ర‌వ‌రి 17న కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తున్న కోటి వృక్షార్చనలో పాల్గొందాం.

ఒక్కొక్కరం మూడు మొక్కలను నాటుదాం. ఈ సంకల్పంలో పాల్గొనాలనుకునేవారు వెంటనే మీ డీటైల్స్ వాట్సాప్ చేయండి” అని పేర్కొంటూ వాట్సాప్ నంబర్ ఇచ్చారు అనసూయ.