
కాంగో నదిలో ఓ పెద్ద పడవ ప్రమాద వశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో 60 మంది ప్రయాణికులు మృతి చెందారు.
నోడోంబీ ప్రావిన్సులోని లాంగోలా ఎకోటి గ్రామానికి సమీపంలోని నదిలో ఓడ మునిగింది.
నీట మునిగిన ఓడలో 700 మంది ప్రయాణికులున్నారని కాంగో మంత్రి ఎంబీకాయి చెప్పారు.
ఓడ మునిగిన తర్వాత 60 మంది మృతదేహాలను వెలికితీశారని, మరికొంతమంది గల్లంతయ్యారని మంత్రి తెలిపారు.
ఓడలో ప్రయాణిస్తున్న 300 మంది ప్రాణాలతో బయటపడ్డారని ఆయన పేర్కొన్నారు.
ఈ పడవ కిన్షాసా నుంచి బయలుదేరి భూమధ్యరేఖ ప్రావిన్సు వైపు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.
ఓడలో ఎక్కువమంది ప్రయాణికులు ఉండటంతో ఓవర్ లోడ్ వల్ల మునిగిందని మంత్రి వివరించారు.